యాదాద్రి శ్రీలక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులతో సముదాయాలు, మొక్కు పూజల నిర్వహణతో మండపాలు రద్దీగా కనిపించాయి. శ్రావణ మాసంతో పాటు ఆదివారం సెలవు కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో సందడి నెలకొంది.
ఎటు చూసినా.. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులే కనిపించారు. కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని దర్శించాలని గంటల కొద్దీ క్యూ కట్టారు. ఆలయ పునర్నిర్మాణ పనులతో పాటు భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో కొండ పైకి వాహనాలను అనుమతినివ్వలేదు.