హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో వార్డుల రిజర్వేషన్ల కేటాయింపుపై దాఖలైన పిటిషన్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
రిజర్వేషన్లపై చివరి క్షణంలో కోర్టుకు వస్తే ఎలాగని ప్రశ్నిస్తూ.. ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల రిజర్వేషన్ల కేటాయింపునకు సంబంధించి 9, 14 జీవోలను సవాలు చేస్తూ బోడుప్పల్‌కు చెందిన జీ రమణారెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.