హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షలు 2026 మార్చి, ఏప్రిల్లో మాసాల్లో నిర్వహించనున్నట్టు సొసైటీ డైరెక్టర్ పీవీ శ్రీహరి ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే వారు ఈ నెల 11 నుంచి 26 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని సూచించారు.
రూ. 25 ఆలస్య రుసుముతో ఈ నెల 27 నుంచి 2026 జనవరి 2 వరకు, రూ. 50 ఆలస్య రుసుముతో జనవరి 3 నుంచి 7 వరకు, తత్కాల్ కింద జనవరి 8 నుంచి 12 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.