హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకుల సొసైటీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న హెల్త్ కమాండ్ సెంటర్లో సుదీర్ఘ అనుభవం కలిగిన వైద్యసిబ్బందికే అవకాశమివ్వాలని, జూనియర్లను నియమించడం తగదని తెలంగాణ ఇండియన్ మెడిసిన్ డాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పే ర్కొన్నది. ఇది సీనియర్లను అవమానించడమేనని ఆగ్ర హం వ్యక్తంచేసింది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పీ సత్యం, ప్రధాన కార్యదర్శి బీ ఆంజనేయులు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆయుష్, మెడికల్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, పారా మెడికల్ సిబ్బంది 25ఏండ్లుగా తక్కువ వేతనాలపై సొసైటీలో విద్యార్థులకు వైద్య సేవలందిస్తున్నారని వివరించారు. హెల్త్ కమాండ్ సెంటర్ ఏర్పాటును చే యాలని సొసైటీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇందులో సుదీర్ఘ వైద్య అనుభవము న్న వైద్యసిబ్బందిని కాదని, జూనియర్లకు అవకాశమివ్వడం హైకోర్టు తీర్పునకు విరుద్ధమని వెల్లడించారు.