హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): మంత్రి జగదీశ్‌రెడ్డితో రాష్ట్ర విద్యుత్తు కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు వెల్లడించిన సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారు.
సంబంధిత అధికారులతో మాట్లాడి ఎల్వోసీలు విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో సాయంత్రానికే ఎల్వోసీలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే మాజిద్, పర్వతాలు, యాదయ్య, శ్రీనివాస్, శ్రీకాంత్, స్వామి, ఇషాక్ పాల్గొన్నారు.