హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : సహజంగా హోటల్‌కెళ్లినా.. రెస్టారెంట్కెళ్లినా భోజనానికి ఎక్కువ ధర.. టిఫిన్‌కు తక్కువ ధర ఉండటం మనం చూస్తుంటాం. భోజనంతో పోల్చితే సగానికంటే తక్కువగా టిఫిన్ ధరలుంటాయి. సహజంగా ఎక్కడైనా ఇదే జరుగుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ధరలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలోని సర్కార్ బడుల్లోని విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్ ధర అధికంగా ఉండగా, మధ్యాహ్న భోజనం ధర తక్కువగా ఉంది. సర్కార్ ఖరారుచేసిన ధరలు చూసి పలువురు విస్తుపోతున్నారు. ధరల వ్యత్యాసంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి.
రాష్ట్రంలో 2026-27 విద్యాసంవత్సరంలో జూన్ నుంచే సర్కార్ బడులు, జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, పాలు అంWhile the price of breakfast for students in government schools in the state is high, the price of midday meal is low.దించాలని సర్కారు నిర్ణయించింది. రాష్ట్రంలోని 26వేలకుపైగా విద్యాసంస్థల్లోని 20.31 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారాన్ని, పాలు అందించనున్నారు. 54,201 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. అల్పాహారం వండేందుకు, సిద్ధం చేసేందుకు మధ్యాహ్న భోజన వర్కర్లు ఆసక్తి చూపిస్తున్నారు. సర్కార్ వీరిని కాదని ఓ రెండు ఎన్జీవోలకు బ్రేక్‌ఫాస్ట్ పథకం బాధ్యతలను అప్పగించింది. మధ్యాహ్న భోజన వర్కర్లకు నెలకు రూ.10వేల వేతనాన్ని ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన ఈ హామీనీ విస్మరించింది.
మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ప్రీ ప్రైమరీ నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న ఒక విద్యార్థికి రోజుకు రూ.6.78 మాత్రమే ఇస్తున్నారు. ఇక 6-12వ తరగతి వరకు గల ఒక విద్యార్థికి రోజుకు రూ.10.17 ఇస్తున్నారు. అదే బ్రేక్‌ఫాస్ట్‌కు వచ్చేసరికి 5వ తరగతిలోపు(ప్రీ ప్రైమరీ)గల ఒక విద్యార్థికి రోజుకు రూ.11.50, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు గల ఒక విద్యార్థికి రోజుకు రూ.13.50 చొప్పున ధరలు ఖరారుచేశారు. ప్రాథమిక తరగతుల్లో రూ.5, ఉన్నత పాఠశాలల్లో రూ. 2 చొప్పున బ్రేక్‌ఫాస్ట్ కంటే మధ్యాహ్న భోజనానికి తక్కువగా ఉండటం గమనార్హం. అది కూడా రెండు ఇడ్లీలు, రెండు బోండాలు, రెండు పూరీలకే రూ. 11.50 నుంచి రూ. 13.50 ఖరారుచేయడం గమనార్హం. మధ్యాహ్న భోజన పథకానికి 2026-27 బడ్జెట్లో రూ.547కోట్లు కేటాయించారు. అదే బ్రేక్‌ఫాస్ట్, పాలకు రూ.856.44కోట్లు కేటాయించారు. మధ్యాహ్న భోజన పథకం కంటే బ్రేక్‌ఫాస్ట్‌కు దాదాపు రూ.300 కోట్లు అధికంగా కేటాయించడం గమనార్హం.
