హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం ఆయన మీడి యా పాయింట్లో ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్, ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్తో కలిసి మాట్లాడా రు. బడుగు బలహీన వర్గాలు.. సామాజిక, రాజకీయ, ఉద్యోగ రంగాల్లో ఎదగాలనేది తమ ప్రభుత్వ ఆకాంక్ష అని తెలిపారు. మేము ఎవరికీ వ్యతిరేకం కాదని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే బీసీ కులగణనపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కులగణనతో 100 శాతం ప్రయోజనం జరిగేలా ముందుకుపోతామని చెప్పారు. శుక్రవారం సభలో బీసీ కుల గణనపై ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు ప్రతి ఒక్కరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు.