కరీంనగర్ విద్యానగర్, ఏప్రిల్ 17: తెలంగాణ విభజన అంశాన్ని భారత్, పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ పార్లమెంట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ శివధర్‌రెడ్డికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు.
శుక్రవారం కరీంనగర్లో పరేడ్‌కు హాజరైన డీజీపీ శివధర్‌రెడ్డిని ఈ విషయమై వివరణ కోరగా.. చట్టసభల్లో మాట్లాడిన అంశాలపై కేసు నమోదు చేసే అధికారం తమకు ఉండదని చెప్పారు. ఈ అంశంపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్టు వెల్లడించారు.