న్యూఢిల్లీ: ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు, రవాణా ఖర్చులను తగ్గించేందుకు కేంద్రం అన్ని మంత్రిత్వశాఖలు, విభాగాలకు ‘ఒక అధికారికి ఒకే అధికారిక వాహనం’ అనే నిబంధనను అమలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
అదనపు బాధ్యతల పేరుతో సీనియర్ అధికారులు పలు ప్రభుత్వ వాహనాలను కేటాయించుకోవడాన్ని ఈ తాజా నిబంధన ద్వారా పూర్తిగా నిషేధించారు. అదనపు బాధ్యతలు అప్పగించినా, గతంలో కేటాయించిన వాహనాన్నే ఉపయోగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.