జనగామ, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ శుక్రవారం జనగామ జిల్లా పర్యాటనకు రానున్నారు. సీఎం పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో సీఎం కొత్త కలెక్టరేట్‌కు చేరుకుంటారు. 11.10 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో జనగామ అభివృద్ధిపై సమీక్షిస్తారు. భోజన విరామం తర్వాత 2 గంటలకు యశ్వంతాపూర్ వద్ద నిర్మించిన టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. కొత్తగా నియమితులైన టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి బాధ్యతల స్వీకరణలో కూడా సీఎం పాల్గొంటారు. అక్కడే జిల్లా పార్టీ ముఖ్యులతో సమావేశమవుతారు. సాయంత్రం 3 గంటలకు బహిరంగసభలో కేసీఆర్ ప్రసంగిస్తారు.
రేపు భువనగిరిలో సీఎం సభ
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో శనివారం తలపెట్టిన సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను గురువారం రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు.