హైదరాబాద్, జూన్7 (నమస్తే తెలంగాణ): దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్జెండర్స్ సాధికారతశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బధిర, అంధుల ఆశ్రమపాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈమేరకు శాఖ డైరెక్టర్ శైలజ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్లోని మలక్పేట, నల్గొండజిల్లా మిర్యాలగూడలోని అవంతిపురం, కరీంనగర్లోని బధిరుల ఆశ్రమపాఠశాలల్లో, మహబూబ్నగర్, కరీంనగర్ అంధుల ఆశ్రమపాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతివరకు, మహబూబ్నగర్ అంధుల ఆశ్రమ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్లో అడ్మిషన్లు కొనసాగుతున్నాయని వివరించారు. వివరాలకు ఆయా పాఠశాలలను సంప్రదించాలని శైలజ సూచించారు.