యాదాద్రి, డిసెంబర్ 3 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి దాతల నుంచి భారీ స్పందన లభిస్తున్నది. భక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందజేస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్కు చెందిన ఇనకొండ చంద్రారెడ్డి తన సహచరులు ఆల పురుషోత్తంరావు, చీటి భాస్కర్రావు, చీటిగోరి హర్షవర్ధన్రావుతో కలిసి 16 తులాల బంగారం, రూ.2 లక్షల చెక్కును ఆలయ ఈవో ఎన్ గీతకు అందజేశారు. కాగా, హైదరాబాద్కు చెందిన ఎస్ వీరేందర్ రూ.50 వేలు, ఆలయ సిబ్బంది వీ ఆంజనేయులు రూ.25 వేల చెక్కును అందజేశారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భక్తులను భాగస్వాములను చేయాలని సంకల్పించిన సీఎం కేసీఆర్కు వారు కృతజ్ఞతలు తెలిపారు.