హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు పాఠశాల విద్యాశాఖలో అడిషనల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న గాజర్ల రమేశ్ రచించి, పాడిన పాట సీడీని శనివారం ఆ శాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఆవిష్కరించారు.
‘ఓడిపోనీయకు నీ ఓటును.. గెలిపించేయ్ ప్రజాస్వామ్య బాటను-వట్టిగ పోనీయకు నీ ఓటును.. పోదాంపదా పోలింగ్ బూత్‌కు’.. అంటూ రమేశ్ పాటను రచించి, ఆలపించారు. ఓటును ఓడిపోనీయవద్దని, ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని ఆకాంక్షిస్తూ తానీపాటను రచించినట్టు రమేశ్ తెలిపారు. సీడీ ఆవిష్కరణలో అడిషనల్ డైరెక్టర్లు లింగయ్య, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.