హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): పదేండ్ల క్రితం ప్రకటించిన గిరిజన యూనివర్సిటీని ఇన్నేండ్లకు ఇస్తారా? అని ప్రధాని మోదీపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మహబూబ్నగర్ సభలో కొత్తగా ప్రధాని ఇచ్చిన హామీ ఏమిటి? అని ప్రశ్నించారు. ఎప్పుడో ఇచ్చిన హామీలను ఇప్పుడు ప్రకటించి.. వాటినే తమ ఘనతగా చెప్పుకోవడం దేనికి సంకేతమని నిలదీశారు. తెలంగాణకు ఎప్పుడో ఇవ్వాల్సిన పసుపుబోర్డును ఇవ్వాళ ఇస్తారా? అని ప్రశ్నించారు. మోదీ ఎన్నికల కోసం చేసే జిమ్మికులను నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.