
టీఆర్ఎస్ అంటే అభివృద్ధికి అమ్మవంటిదని, బిజెపీ దేశాన్నే అమ్మేస్తుందని సంక్షేమశాఖ మంత్రి కొప్పులఈశ్వర్ అన్నారు. జమ్మికుంట పట్టణంలో 5,11,27 వార్డు లలో పర్యటించిన కొప్పుల 27,వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

దళిత బంధు ఏవరో అడిగితే తీసుకొచ్చిన కార్యక్రమం కాదు – కొప్పుల
తరతరాలుగా వెనుకబడినజాతి, వివక్షకు గురైన జాతి, అంటరానితనానికి గురై చదువులు లేక ఆర్థిక స్థోమతలేక విజ్ఞానం ఉండి కూడ వెనుకబడిన జాతి దళిత జాతి, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినకానీ దళితుల జీవితాల్లో మార్పు రాలేదు. ఆ జీవితాల్లో వెలుగులు నింపేందుకే కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం దళితబంధు..

కేసీఆర్ ఉచితం అంటే ..మోడీ మీటర్లు అంటండు – కొప్పుల
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను ఇష్టారీతిన పెంచడంతో నిత్యావసరాలు కూడా మనం కొనే పరిస్థితుల్లో లేము. కేసీఆర్ 24గంటలు ఉచిత కరెంటు ఇస్తుంటే, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టాలని మోడీ కుట్ర చేస్తున్నారు.

టీఆర్ఎస్ సంక్షేమ ప్రభుత్వం- బీజేపీ ఊచకోతల వ్యక్విత్వం – కొప్పుల
బిజెపి పాలితరాష్ట్రం గుజరాత్ లోని గోధ్రాలో దళితులు, ముస్లింలను ఊచకోత కోసిన సంఘటనను ప్రపంచం మరిచిపోదు. అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నివర్గాలకు న్యాయం చేయాలని, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా దళితబంధు పథకం అమలవుతుంది.