తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. డిసెంబర్ 16, 2021 న గురువారం ఫలితాలు వెల్లడి కానున్నాయని తెలంగాణ ఇంటర్ బోర్డ్ స్పష్టం చేసింది. అక్టోబర్ 25, 2021 నుంచి నవంబర్ 3, 2021 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే.
తెలంగాణ ఇంటర్ బోర్డ్ అఫిషయల్ వెబ్సైట్లో tsbie.cgg.gov.in ఫలితాలు విడుదల కానున్నాయి.ఫలితాలు విడుదల కాగానే.. విద్యార్థులు ఆ వెబ్సైట్లోకి వెళ్లి తమ రూల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఇచ్చి స్కోర్‌కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో మార్కుల లిస్టు ఉంటుంది.
ఫలితాలు విడుదల అయ్యాక.. అఫిషియల్ వెబ్‌సైట్‌కు విద్యార్థుల తాకిడి ఎక్కువగా ఉంటే.. సర్వర్లు బిజీ అయిపోతాయి. అఫిషియల్ వెబ్సైట్ పనిచేయకపోతే.. results.cgg.gov.in, examresults.ts.nic.in వెబ్సైట్లలో విద్యార్థులు తమ రిజల్ట్స్‌ను చెక్ చేసుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సీబీఎస్ఈ ‘గ్రేస్ మార్కులు’ కలపనుందంటూ ప్రచారం.. వాస్తవమెంత?
ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఎంపికైతే 2 లక్షల స్కాలర్షిప్