తెలంగాణ ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల కాబోతున్నాయి. అక్టోబర్ 25, 2021 నుంచి నవంబర్ 3, 2021 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 15న అంటే ఈరోజు బుధవారం ఫలితాలను తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు విడుదల చేసే అవకాశం ఉంది. వీటి ఫలితాలు తెలంగాణ ఇంటర్ బోర్డ్ అఫిషయల్ వెబ్సైట్లో tsbie.cgg.gov.in విడుదల కానున్నాయి.ఫలితాలు విడుదల కాగానే.. విద్యార్థులు ఆ వెబ్సైట్లోకి వెళ్లి తమ రూల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఇచ్చి స్కోర్‌కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో మార్కుల లిస్టు ఉంటుంది.
ముందు tsbie.cgg.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత హోమ్‌పేజీలో TS Inter 2021 first year results లింక్ మీద క్లిక్ చేయండి. వేరే పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ హాల్‌టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేస్తే స్క్రీన్ మీద మార్కుల లిస్టు కనిపిస్తుంది. ఆ మార్కుల లిస్టును అక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఫలితాలు విడుదల అయ్యాక.. అఫిషియల్ వెబ్‌సైట్‌కు విద్యార్థుల తాకిడి ఎక్కువగా ఉంటే.. సర్వర్లు బిజీ అయిపోతాయి. అఫిషియల్ వెబ్సైట్ పనిచేయకపోతే.. results.cgg.gov.in, examresults.ts.nic.in వెబ్సైట్లలో విద్యార్థులు తమ రిజల్ట్స్‌ను చెక్ చేసుకోవచ్చు.