Weather News | ఈ నెల 27వ తేదీ వరకు భారీ వర్షాలు
Weather News | రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Center) వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరిక (Yellow Warning) జారీచేసింది.

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Center) వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరిక (Yellow Warning) జారీచేసింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొన్నది. పశ్చిమ మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఉన్న ఉపరితల ద్రోణి బలహీనపడగా, నైరుతి దిశ నుంచి తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు వీస్తున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 27వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసిందని, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో అత్యధికంగా సిద్దిపేట జిల్లా చాట్లపల్లిలో 10 సెంటీ మీటర్ల వర్షం, హన్మకొండ జిల్లా ధర్మసాగర్ లో 9, వరంగల్ జిల్లా శాయంపేటలో 8, సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో 7, జనగామ జిల్లా నర్మెట్ట, సిద్దిపేట జిల్లా కొండపాక 5 సెంటీ మీటర్ల వర్షం కురిసినట్టు పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
అలా చేస్తే పరిశ్రమల భూ కేటాయింపులు రద్దు చేస్తాం
Earth Photo : చంద్రమండలం నుంచి ఫొటో దిగిన భూమి
బీజేపీ అంటే బిగ్ జోకర్స్ పార్టీ
Read Today's Latest Telangana-photos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
Cyber Crime | వీడియోకాల్ చేసి రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

