బీజేపీ అంటే బిగ్ జోకర్స్ పార్టీ
- ఎన్ని యాత్రలు చేసినా వారికి అధికారం కల్ల
- మిషన్ భగీరథను కేంద్రమే ప్రశంసించింది
- ఎంపీ అరవింద్ చెత్త మాటలు మానుకోవాలి
- పీయూసీ చైర్మన్ ఏ జీవన్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 22 ( నమస్తే తెలంగాణ ): బీజేపీ అంటే బిగ్ జోకర్స్ పార్టీ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఏ జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు పాదయాత్రలు చేసినా, మోకాళ్ల మీద నడిచినా రాష్ట్రంలో అధికారం దక్కదని చెప్పారు. ఎల్కే అద్వానీని పక్కనబెట్టి ఆదానీ, అంబానీలను అక్కున చేర్చుకున్న మోదీని నిలదీయాలన్నారు. ఆదివారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. హిందువులకు పవిత్రమైన పసుపుతోనే బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ రాజకీయం చేశారని విమర్శించారు. పసుపు బోర్డును సాధించలేకపోతే ఆయనను పసుపు కడాయి కింద పాతిపెడతారని హెచ్చరించారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత గురించి మాట్లాడే స్థాయి అరవింద్‌కు ఉన్నదా అని ప్రశ్నించారు.
ఇకనైనా మాట్లాడటం నేర్చుకోవాలని హితవు చెప్పారు. ఒకే ఇంట్లో మూడు పార్టీలున్న అరవింద్ ఇంట గెలవకుండా రచ్చ గెలుస్తాడా అని ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథను బీజేపీ మంత్రులు పొగిడిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీజేపీలు అవినీతికి కేరాఫ్ అని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం 28 మంది అవినీతిపరులను దేశం దాటించిందని పేర్కొన్నారు. జైలుకెళ్లిన రేవంత్‌రెడ్డి కూడా అవినీతి గురించి మాట్లాడటమా? అని ఎద్దేవా చేశారు.
Read Today's Latest Topstories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

