వరంగల్: బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ఇంటింటికి తీసుకెళ్లాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం ద్వారా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి(MLA Sudarshan Reddy )కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని సర్వాపురంలో నాలుగు వార్డులకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ సారధ్యంలో అలమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు తీసుకెళ్లాలన్నారు. చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడుగాలని సూచించారు. ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో పని చేయాలన్నారు. కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. మూడోసారి బీఆర్ఎస్ను గెలిపించేందుకు కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు.