నల్లగొండ : సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(MLA Chirumurthy) అన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచి గౌరవం ఉంటుందన్నారు. తాజాగా కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వందమంది ఎమ్మెల్యే చిరుమర్తి, జడ్పీచైర్మన్ బండా నరేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మక్క నరసింహ, పోల్లగొని సైదులు, పసునూరి శంకర్, దోమ్మటి శ్రీను, బొబ్బలి సైదులు, సుధాకర్, కొండ్ర కృష్ణయ్య, గోలి శ్రీహరి, రంగయ్య, సతీష్, శంకరయ్య, గోలి సాయిలు, శ్రీను తదతరులు ఉన్నారు.