ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం మరిపెడ ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది మరిపెడ పురపాలక సంఘం పరిధిలో మలేరియా నివారణ పై అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు.
రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరంలో వెలుగు చూసిన మలేరియా కేసులు 5,222. గత ఏడాది నమోదైన కేసులు కేవలం 611. తొమ్మిదేండ్లలోనే మలేరియా బాధితుల సంఖ్య 90 శాతం పడిపోయింది.