మరిపెడ : ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం మరిపెడ ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది మరిపెడ పురపాలక సంఘం పరిధిలో మలేరియా నివారణ పై అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ర్యాలీని డాక్టర్ రవి ప్రారంభించారు ఈ సందర్భంగా సిబ్బందితో మలేరియా అంతం మనతో అంటూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం డాక్టర్ రవి మాట్లాడుతూ అనాఫిలిస్ అనే ఆడ దోమలు కుట్టడం వల్ల మలేరియా జ్వరాలు వస్తాయని అన్నారు. వ్యాధి సోకిన వారికి వణుకుతో కూడిన తీవ్రమైన చలి జ్వరం, వాంతులు, చెమటలు పోయుట, తలనొప్పి, ఒళ్లు నొప్పులు లక్షణాలు ఉంటాయన్నారు.
ఎవరైనా జ్వరం వచ్చిన వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకొని వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే చికిత్స చేయించుకోవాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల న్నారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ మంగమ్మ, సూపర్వైజర్ కృష్ణ, వెంకన్న, సుదర్శన్, మాధవి, లక్ష్మి, సాయి శ్రీ, సిరి, హెల్త్ అసిస్టెంట్ వీరయ్య, నరసయ్య, సరళ, ఝాన్సీ, శ్రీదేవి, నాగమణి, అనిత తదితరులు పాల్గొన్నారు.