ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ ప్లేయర్ల పతక ప్రదర్శన దిగ్విజయంగా కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన వేర్వేరు క్రీడా విభాగాల్లో వ్రితి అగర్వాల్, వీ లోకేశ్ పసిడి పతకాలతో మెరిశారు.
ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడల్లో రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పతక ప్రదర్శన దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఈత కొలనులో తనకు తిరుగులేదని చాటిచెబుతూ వ్రితి అదరగొడుతున్నది.