అహ్మదాబాద్: ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడల్లో రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పతక ప్రదర్శన దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఈత కొలనులో తనకు తిరుగులేదని చాటిచెబుతూ వ్రితి అదరగొడుతున్నది. ఇప్పటికే మూడు పతకాలు తన ఖాతాలో వేసుకున్న ఈ యువ స్విమ్మర్ తాజాగా కాంస్య కాంతులు విరజిమ్మింది. శుక్రవారం జరిగిన మహిళల 400మీటర్ల ఫ్రీైస్టెల్ ఫైనల్ రేసును 4: 34: 98సెకన్ల టైమింగ్తో ముగించిన వ్రితి మూడో స్థానంలో నిలిచింది.
రామచంద్ర హశిక(కర్ణాటక, 4:32:17సె), సచ్దేవ్ భవ్య(4:32:80సె) వరుసగా స్వర్ణ, రజత పతకాలు దక్కించుకున్నారు. ఆది నుంచి తనదైన దూకుడు కనబరిచిన వ్రితి మెండైన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. ఓవరాల్గా ఇప్పటి వరకు టోర్నీలో తెలంగాణ 7 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలు మొత్తంగా 19 పతకాలతో 14వ స్థానంలో కొనసాగుతున్నది.