నాని కథానాయకుడిగా రూపొందుతోన్న ‘సరిపోదా శనివారం’ సినిమా ఆగస్ట్ 29న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందం ఈ సినిమా ప్రమోషన్ని వేగవంతం చేసింది.
ఆ రోజుల్లో ఎన్టీఆర్, కృష్ణ సినిమాలు నెలకు ఒకటి చొప్పున విడుదలయ్యేవి. ఆమాటకొస్తే నెలకు రెండుమూడు సినిమాలు విడుదలైన దాఖలాలు కూడా ఉన్నాయి. చిరంజీవి, బాలకృష్ణ కూడా ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసేవాళ్లు.