వచ్చే నెలలో కొత్త హంగామా షురూ?
ఆ రోజుల్లో ఎన్టీఆర్, కృష్ణ సినిమాలు నెలకు ఒకటి చొప్పున విడుదలయ్యేవి. ఆమాటకొస్తే నెలకు రెండుమూడు సినిమాలు విడుదలైన దాఖలాలు కూడా ఉన్నాయి. చిరంజీవి, బాలకృష్ణ కూడా ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసేవాళ్లు.
ఆ రోజుల్లో ఎన్టీఆర్, కృష్ణ సినిమాలు నెలకు ఒకటి చొప్పున విడుదలయ్యేవి. ఆమాటకొస్తే నెలకు రెండుమూడు సినిమాలు విడుదలైన దాఖలాలు కూడా ఉన్నాయి. చిరంజీవి, బాలకృష్ణ కూడా ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసేవాళ్లు. ఇప్పటి హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయటమే గొప్ప. అయితే హీరో నానిని మాత్రం అందులో మినహాయించాలి. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టిన నాని ‘అష్టాచెమ్మా’తో హీరోగా మారి 15ఏళ్లు. ఈ పిరియడ్‌లో 30కి పైగా సినిమాల్లో హీరోగా చేసేశాడు. అంటే రమారమి ఏడాదికి రెండు సినిమాల చొప్పున చేశాడన్నమాట. ఈ విషయంలో నానిని ఎవరైనా అభినందించాల్సిందే. ఈ స్పీడ్‌ని నేటికీ నాని కొనసాగిస్తూనేవున్నాడు. ఉదాహరణకు నాని నటించిన ‘హాయ్ నాన్న’ ఈ మధ్యే విడుదలైంది. ఆ సినిమా వేడి చల్లారకముందే తను నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమా కూడా విడుదలకు రెడీ అయ్యిందని సమాచారం. వచ్చే నెలలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. నానితో ‘అంటే సుందరానికి’ లాంటి ఫీల్‌గుడ్ మూవీని తీసిన వివేక్ ఆత్రేయ దర్శకుడు కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. ఎస్.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. జేక్స్ బెజాయ్ సంగీత దర్శకుడు. ఏదేమైనా.. సినిమాలు వేగంగా చేస్తూ, ఎంతోమంది సినీ కార్మికులకు పని కల్పిస్తున్న నానీని నిజంగా మెచ్చుకోవాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveenkumar | శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా.. సాక్ష్యాధారాలతో బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అన్నదాతపై అశనిపాతం.. కన్నీరు పెట్టిస్తున్న ‘మురసు’
Beauty tips | మీ చర్మాన్ని యవ్వనంగా మార్చే బొటాక్స్ ట్రీట్మెంట్ గురించి తెలుసా..?
Ambati Rambabu | రాజకీయ కుట్రతోనే ఈడీ నోటీసులు : మాజీ మంత్రి అంబటి రాంబాబు
సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

