Saripodhaa Sanivaaram | నాని కథానాయకుడిగా రూపొందుతోన్న ‘సరిపోదా శనివారం’ సినిమా ఆగస్ట్ 29న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందం ఈ సినిమా ప్రమోషన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ఇందులోని ప్రధాన పాత్రలందరి ఫస్ట్‌లుక్స్‌ని శనివారం మేకర్స్ విడుదల చేశారు.
ఇందులో భద్రగా అదితిబాలన్, గోవర్ధన్‌గా అజయ్, కూర్మానంద్‌గా మురళీశర్మ, నారాయణ ప్రభగా అజయ్‌ఘోష్ పాత్రలని పరిచయం చేస్తూ పోస్టర్లను విడుదల చేశారు. అలాగే ఈ మూవీలో సోకులపాలెం నేపథ్యం చాలా కీలకం కాగా, సోకులపాలెం ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఓ పోస్టర్ని కూడా రివీల్ చేశారు. ప్రియాంక అరుళ్ మోహన్ ఇందులో కథానాయిక. వివేక్ ఆత్రేయ దర్శకుడు. డి.వి.వి.దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: మురళి.జి, సంగీతం: జేక్స్ బిజోయ్.