భద్రాద్రి జిల్లాలో కూరగాయల ధరలు అమాంతంగా పెరిగాయి. స్థానికంగానే ఉద్యానవన పంటలు సాగవుతున్నప్పటికీ ధరలు మాత్రం ప్రియమవుతున్నాయి. కార్తీకమాసం కావడంతో కూరగాయలు, ఆకుకూరలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.
దసరా పండుగ వేళ ధరలు దడ పుట్టిస్తున్నాయి. కూరగాయల రేట్లు కాక రేపుతుండగా.. నిత్యావసరాలు ఆకాశాన్నంటుతున్నాయి. టమాట కిలో రూ.80 కి చేరి మాట విననంటున్నది. ఉల్లి ధరలు కూడా రూ.60కి చేరి కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.