గోదావరి సాక్షిగా ఇసుక దోపిడీ కొనసాగుతూనే ఉంది. కాంట్రాక్టర్ల అండదండలతో ఎలాంటి ఆన్లైన్ బుకింగ్ లేకుండానే ఇసుక తరలుతున్నది. అలాగే క్వారీల వద్ద అదనపు బకెట్ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది.
రాష్ట్రంలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ కొనసాగుతున్నది. అధికార పార్టీ నేతల అండదండలతో, తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్ఎండీసీ) సహకారంతో కాంట్రాక్టర్లు మరింత రెచ్చిపోతున్నారు.
ఇసుక రీచ్‌లు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. నిబంధనలకు తిలోదకాలిస్తున్నాయి. రూట్‌మ్యాప్ లేకుండా లారీలకు అనుమతించడం, వచ్చి న వాహనాలను వెంట వెంటనే లోడ్ చేయకపోవడం, ప్రధాన రహదారిపై రోజు ల తరబడి నిలిపి ఉంచడం�