జాతీయ రైఫిల్ అసోసియేషన్(ఎన్ఆర్ఏఐ) ఉపాధ్యక్షుడిగా రాష్ర్టానికి చెందిన అమిత్ సంఘీ ఎన్నికయ్యారు. శుక్రవారం మొహాలీ వేదికగా జరిగిన ఎన్నికల్లో సీనియర్ ఉపాధ్యక్షుడిగా సంఘీ విజయం సాధించారు.
గోవా వేదికగా జరిగిన ఇండియా ఓపెన్ షూటింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ షూటర్లు పతక ధమాకా మోగించారు. పురుషుల 50మీ రైఫిల్ త్రి పొజిషన్ ఈవెంట్లో మణిదీప్ జెట్టా రెండు స్వర్ణ పతకాలతో మెరిశాడు.