హైదరాబాద్, ఆట ప్రతినిధి : గోవా వేదికగా జరిగిన ఇండియా ఓపెన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ షూటర్లు పతక ధమాకా మోగించారు. పురుషుల 50మీ రైఫిల్ త్రి పొజిషన్ ఈవెంట్లో మణిదీప్ జెట్టా రెండు స్వర్ణ పతకాలతో మెరిశాడు. పురుషుల జూనియర్ 50మీ రైఫిల్ త్రీ ప్రోన్ విభాగంలో రయాన్ ఫైజల్ పసిడి సొంతం చేసుకున్నాడు. మరోవైపు 10మీ ఎయిర్ పిస్టల్ జూనియర్‌తో టీమ్ ఈవెంట్లో అర్సిత కరార్ రెండు స్వర్ణాలు సాధించింది. ప్రణతి(రజతం, కాంస్యం), గోపాల కృష్ణ(కాంస్యం), శంకర్(రజతం) ఆకట్టుకున్నారు. పతక విజేతలను తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ అభినందించింది.