హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ రైఫిల్ అసోసియేషన్(ఎన్ఆర్ఏఐ) ఉపాధ్యక్షుడిగా రాష్ర్టానికి చెందిన అమిత్ సంఘీ ఎన్నికయ్యారు. శుక్రవారం మొహాలీ వేదికగా జరిగిన ఎన్నికల్లో సీనియర్ ఉపాధ్యక్షుడిగా సంఘీ విజయం సాధించారు.
ప్రస్తుతం తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న అమిత్..దక్షిణభారత్ నుంచి ఎన్ఆర్ఏఐలో కీలక పదవి దక్కించుకున్న తొలి వ్యక్తిగా నిలిచారు.