శాసనమండలి, శాసనసభ వర్షాకాల సమావేశాలు 4 రోజులపాటు (గురువారం నుంచి ఆదివారం వరకు) సాగాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు సహా మొత్తం 12 బిల్లులను ఉభయ సభలు ఆమోదించాయి.
అసెంబ్లీ చుట్టూ 4 కిలోమీటర్ల పరిధిలో గురువారం నుంచి ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. 3వ తేదీ నుంచి శాసన సభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతున్నాయి.