కొంతమంది వారికి వచ్చిన భాషలను చక్కగా మాట్లాడుతారు. కానీ, రాత విషయానికి వస్తే మాత్రం దారుణమైన పొరపాట్లు చేస్తుంటారు. ఇక్కడి సంభాషణలోనూ ఇదే ప్రధానమైన అంశం.
కొంతమంది మద్యపాన ప్రియులు సీసా ఎత్తారంటే మళ్లీ దించరు. అంతగా వ్యసనపరులై మత్తులో జోగుతూ బతికేస్తుంటారు. ఎదుటివాళ్లు మంచిది
కాదన్నా వాళ్లు వినరు. పైగా అది తమకు ఆరోగ్యపానీయమని వితండవాదం చేస్తారు.
కాశీ వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకెళ్లినట్టు,పిల్లి మెడలో గంట కట్టడం, పొయ్యిలో పిల్లి లేవలేదు... ఇలా తెలుగులో పిల్లి మీద నుడికారాలు చాలానే ఉన్నాయి. ఇలాంటివి ప్రయోగిస్తుంటే సంభాషణలో చమత్కారం ఉట్టిపడుతుంది
క్రికెట్లో బ్యాట్స్మన్ ఔటయ్యే విధాల్లో ‘రన్ ఔట్' ఒకటి. అయితే, రన్ అనే పదాన్ని ఆంగ్లంలో ఒక్క ఆట విషయంలోనే కాకుండా జీవిత అనుభవాల్లోనూ ఉపయోగించవచ్చు. ఎవరైనా డబ్బు కోసం వెంపర్లాడుతూ ఉంటే ‘రన్నింగ్ ఆఫ�