వన్యప్రాణుల దాహం తీర్చేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 26న ‘నమస్తే తెలంగాణ’లో ‘వన్యప్రాణుల దాహం తీరేదేలా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు.
రాష్ట్ర ప్రభుత్వం వేసవిలో అడవిలోని మూగజీవాల దప్పిక తీర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. అటవీ విస్తీర్ణం పెంచేందుకు నాటిన మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.
వేసవిలో అటవీ జంతువుల దాహార్తిని తీర్చేందుకు వికారాబాద్ జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వన్యప్రాణులు నీరు తాగేందుకు అనుకూలంగా ఉన్న అడవిలోని పలు ప్రాంతాల్లో 120 సాసర్పిట్లు, పెర్కోలే�