సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు 11వ వేజ్‌బోర్డు ప్రకారం పెన్షన్లు, ఇతర బకాయిలు చెల్లించాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దండంరాజు రాంచందర్‌రావు విజ్ఞప్తిచేశారు.
పెన్షన్ పెంచి.. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని సింగరేణి రిటైర్డ్ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కార్పొరేట్ కొత్తగూడెం హెడ్డాఫీస్ ఎదుట ధర్నా చేశారు.