హైదరాబాద్, జూలై 20(నమస్తే తెలంగాణ): సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు 11వ వేజ్‌బోర్డు ప్రకారం పెన్షన్లు, ఇతర బకాయిలు చెల్లించాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దండంరాజు రాంచందర్‌రావు విజ్ఞప్తిచేశారు. దీనిపై గుర్తింపు సంఘం నాయకులు వెంటనే సింగరేణి చైర్మన్ బలరాంతో చర్చించి సత్వరమే అమలయ్యేలా చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. సింగరేణి ఉద్యోగులకు 11వ వేజ్ బోర్డు ప్రకారం వేతనాలు చెల్లిస్తున్నారని కానీ, పెన్షనర్లకు మాత్రం ఇంకా 10వ వేజ్‌బోర్డు ప్రకారమే పెన్షన్లు చెల్లిస్తున్నట్టు వాపోయారు. దీనివల్ల పెన్షనర్లకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తకు వ పెన్షన్, పాత వేజ్‌బోర్డు ప్రకారం పెన్ష న్ చెల్లించడంతో తాము సమస్యలు ఎదుర్కొంటున్నట్టు వివరించారు.