ప్రణాళికా బద్ధంగా అడుగులు వేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించి, సత్ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు పనిచేసే చోట అధికారులతో గౌరవభావంతో మెలుగుతారు.
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. ఏకాగ్రత, సాహసం అవసరం. నలుగురిలో గుర్తింపు పొందుతారు. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి.
ఆదాయం పెరుగుతుంది. నెల చివర్లో బంధువులతోఅభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ప్రణాళికతో పనిచేయండి.
శ్రద్ధతో పనులు చేస్తే విజయం వరిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఊహించని ఖర్చులు ఉంటాయి. పరిచయాలతో పనులు నెరవేరుతాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు.