Ugadi Panchangam 2024 కుంభం
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. ఏకాగ్రత, సాహసం అవసరం. నలుగురిలో గుర్తింపు పొందుతారు. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి.
ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆదాయం: 14 వ్యయం: 14
రాజపూజ్యం: 6 అవమానం: 1
చైత్రం: ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. ఏకాగ్రత, సాహసం అవసరం. నలుగురిలో గుర్తింపు పొందుతారు. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి.
వైశాఖం: ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
జ్యేష్ఠం: ఈ నెల గ్రహస్థితి అనుకూలంగా ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలను జాగ్రత్తగా నిర్వర్తించాలి.
ఆషాఢం: రాబడి పెరుగుతుంది. అవసరాలు తీరుతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల అంచనాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తారు.
శ్రావణం: కోర్టు పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరగడంతో మనశ్శాంతి ఉండదు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కళాకారులకు ఈ నెల అనుకూలిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది.
భాద్రపదం: వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. అయితే కొత్త పరిచయస్థులతో జాగ్రత్త అవసరం. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది.
ఆశ్వీయుజం: ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఖర్చులు పెరగవచ్చు. ఆదాయం స్థిరంగా ఉండటంతో సంతృప్తిగా ఉంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది.
కార్తీకం: ఈ నెలలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. భూములు, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. అనాలోచిత నిర్ణయాలతో కొన్ని ఇబ్బందులు ఎదురువుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
మార్గశిరం: దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. చేయవలసిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. భూ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం.
పుష్యం: ప్రారంభించిన పనులు పూర్తి చేయడానికి చిత్తశుద్ధి అవసరం. భార్యాపిల్లలతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం. ఒప్పందాల విషయంలో సంయమనంతో వ్యవహరించండి.
మాఘం: బంధువులతో అనుబంధం పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులకు విదేశీయాన యోగం.
ఫాల్గుణం: ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. అనవసరమైన చర్చల మూలంగా మనశ్శాంతి కరువవుతుంది. వ్యాపారులు నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్త పాటించాలి. భూ లావాదేవీల్లో జాప్యం జరగవచ్చు.
ఈ రాశివారికి గురువు తృతీయం (ఏప్రిల్ 31 వరకు), సంవత్సరం పూర్తయ్యే దాకా చతుర్థంలో ఉంటాడు. జన్మరాశిలో శని, ద్వితీయంలో రాహువు, అష్టమంలో కేతువు సంచరిస్తారు. గురువు మినహా మిగిలిన గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. ఏల్నాటి శని ప్రభావం ఉన్నది. శివుడు, దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

