Ugadi Panchangam 2024 ధనుస్సు
శ్రద్ధతో పనులు చేస్తే విజయం వరిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఊహించని ఖర్చులు ఉంటాయి. పరిచయాలతో పనులు నెరవేరుతాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు.
- మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
- ఆదాయం: 11 వ్యయం: 5
- రాజపూజ్యం: 7 అవమానం: 5
చైత్రం: శ్రద్ధతో పనులు చేస్తే విజయం వరిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఊహించని ఖర్చులు ఉంటాయి. పరిచయాలతో పనులు నెరవేరుతాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు.
వైశాఖం: పనులు పూర్తి చేయడంలో సంయమనం, నైపుణ్యం అవసరం. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.
జ్యేష్ఠం: నిర్ణీత సమయంలో పనులు పూర్తవుతాయి. వ్యాపారం సాఫీగా కొనసాగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలతో ఇబ్బందులు రావచ్చు. సంపాదన స్థిరంగా ఉంటుంది.
ఆషాఢం: బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అన్ని పనులు దగ్గర ఉండి పూర్తి చేసుకోవడం మంచిది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి అనుకూలం.
శ్రావణం: సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అయితే వివాదాల జోలికి వెళ్లకండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులు శ్రమించాల్సిన సమయం.
భాద్రపదం: ఉద్యోగులు అధికారులతో స్నేహాన్ని పెంపొందించుకుంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. ఉత్సాహంతో పనులుచేస్తారు.
ఆశ్వీయుజం: ఈ నెలలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. భూ తగాదాలు ముందుకు వస్తాయి. మనశ్శాంతి కొరవడుతుంది. వ్యాపార విస్తరణ వాయిదా పడుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం.
కార్తీకం: కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. మనస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ధైర్యంతో ముందుకు వెళతారు. రావలసిన డబ్బు సమయానికి అందకపోవడంతో సర్దుబాట్ల అవసరం ఏర్పడవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు.
మార్గశిరం: వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. నూతన ఒప్పందాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు శ్రమించ వలసిన సమయం. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. శ్రమ ఎక్కువ అవుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. అధికారుల ఆదరణ ఉంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు.
పుష్యం: రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఇంటా, బయటా సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు
మాఘం: పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతుంది. చివరికి విజయవంతంగా పూర్తిచేస్తారు. అనవసరమైన ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించండి. ఆత్మీయులతో వివాదాలు తలెత్తవచ్చు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది.
ఫాల్గుణం: ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చులు పెరగవచ్చు. సంయమనంతో ఉండటం మంచిది. వ్యాపారులకు అనుకూల సమయం. భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. అన్నీ చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది.
రాశివారికి గురువు ఐదింట (ఏప్రిల్ 31 వరకు), సంవత్సరం పూర్తయ్యే దాకా ఆరింట ఉంటాడు. తృతీయంలో శని, చతుర్థంలో రాహువు, రాజ్యంలో కేతువు సంచరిస్తారు. శని, కేతువు పూర్తి అనుకూల ఫలితాలు ఇస్తారు. గురువు, రాహువు మిశ్రమంగా ఉన్నారు. శివుడు, దుర్గాదేవి ఆరాధనతో శుభఫలితాలు పొందుతారు.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

