Ugadi Panchangam 2024 మీనం
ప్రణాళికా బద్ధంగా అడుగులు వేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించి, సత్ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు పనిచేసే చోట అధికారులతో గౌరవభావంతో మెలుగుతారు.
- పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
- ఆదాయం: 11 వ్యయం: 5
- రాజపూజ్యం: 2 అవమానం: 4
చైత్రం: ప్రణాళికా బద్ధంగా అడుగులు వేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించి, సత్ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు పనిచేసే చోట అధికారులతో గౌరవభావంతో మెలుగుతారు.
వైశాఖం: అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. ఉద్యోగులు సమర్థంగా విధులు నిర్వర్తిస్తారు. సహోద్యోగులతో సంబంధాలు పెంపొందుతాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి.
జ్యేష్ఠం: ప్రారంభించిన పనులు మొదట్లో మందకొడిగా సాగినప్పటికీ, తర్వాత అనుకూలంగా పూర్తవుతాయి. బంధువులు, స్నేహితుల వలన కలిసి వస్తుంది. కొన్ని విషయాలలో మనస్పర్థలు రావచ్చు.
ఆషాఢం: కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. నలుగురిలో కీర్తి ప్రతిష్ఠలు, గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం.
శ్రావణం: ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. అనవసర చర్చల వల్ల మనశ్శాంతి కొరవడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. రాబడి పెంచుకునే మార్గాలను అన్వేషిస్తారు.
భాద్రపదం: ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతోషంతో పనులు చేస్తారు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంపై మనసు నిలుపుతారు. ప్రయాణాల కారణంగా అలసట పెరగవచ్చు. వివాదాలకు దూరంగా ఉంటారు. బరువు, బాధ్యతలు పెరుగుతాయి.
ఆశ్వీయుజం: కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలం. సమయ పాలనతో సత్ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.
కార్తీకం: స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉత్సాహంతో ముందుకు వెళతారు.
మార్గశిరం: కుటుంబంలో అన్ని విషయాలను చర్చించి, నిర్ణయాలను తీసుకుంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. గతంతో పోలిస్తే ఖర్చులు తగ్గుతాయి. ఆర్థిక లావాదేవీలకు అనుకూలం.
పుష్యం: ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంఘంలో సత్కీర్తి పొందుతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. నలుగురికి సాయపడతారు.
మాఘం: ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అవసరాలకు సరిపడా డబ్బు చేతిలో ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం. పట్టుదలతో ఫలితాలు సాధిస్తారు.
ఫాల్గుణం: శ్రమకు తగిన ఫలితం పొందుతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల అలసట, అనారోగ్య సూచన. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది.
ఈ రాశివారికి గురువు ద్వితీయం (ఏప్రిల్ 31 వరకు), సంవత్సరం పూర్తయ్యే దాకా తృతీయంలో ఉంటాడు. వ్యయంలో శని, జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతువు సంచరిస్తారు. ప్రధాన గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. ఏల్నాటి శని ప్రభావం ఉన్నది. శివుడు, దుర్గాదేవి, వినాయకుడి ఆరాధన శుభప్రదం.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Alias Rukmini | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Rapido Driver | కానిస్టేబుల్ చెవిని కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో
Cyclonic storm | ఏపీ, ఒడిశాకు పొంచివున్న తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వాలు..!
Ramayana | రాముడు, సీత ప్రేమకు సంగీత రూపం.. ‘రామాయణ’ నుంచి ‘రంగులు రంగులే’ పాట విడుదల!
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ వివాదంపై స్పందించిన దర్శకుడు వేణు ఉడుగుల.. ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

