Ugadi Panchangam 2024 మకరం
ఆదాయం పెరుగుతుంది. నెల చివర్లో బంధువులతోఅభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ప్రణాళికతో పనిచేయండి.
- ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
- ఆదాయం: 14 వ్యయం: 14
- రాజపూజ్యం: 3 అవమానం: 1
చైత్రం: ఆదాయం పెరుగుతుంది. నెల చివర్లో బంధువులతోఅభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ప్రణాళికతో పనిచేయండి.
వైశాఖం: వివాదాలలోకి వెళ్లకుండా పనులపై మనసు నిలపడం మంచిది. మానసిక సంఘర్షణకు గురవుతారు. ఉద్యోగం సంతృప్తికరంగా కొనసాగుతుంది. ప్రారంభించిన పనులు అవాంతరాలతో పూర్తవుతాయి.
జ్యేష్ఠం: రాబడి అస్థిరంగా ఉన్నప్పటికీ, ఏదో రకంగా డబ్బు సమకూరుతుంది. సహోద్యోగులు, అధికారులతో స్నేహంగా ఉంటారు. కొత్త పరిచయాలతో ఇబ్బందులు ఏర్పడతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది.
ఆషాఢం: ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. అనవసరమైన ప్రయాణాల వల్ల అలసట, వృథా ఖర్చులు ఉండవచ్చు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి.
శ్రావణం: ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తిలో పనిభారం పెరిగిననూ, ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సంయమనంతో ఆలోచించండి.
భాద్రపదం: వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పిల్లల చదువు కోసం మంచి నిర్ణయాలను తీసుకుంటారు. విదేశీ ప్రయాణాల విషయంలో ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. ప్రణాళికతో ముందుకు వెళ్తే అధిగమిస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.
ఆశ్వీయుజం: సంయమనంతో ఉండటం అవసరం. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల సమయం. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యమైన పనులలో జాప్యం జరగవచ్చు.
కార్తీకం: ప్రణాళికతో పనులను చేస్తారు. స్వశక్తితో విజయం సాధిస్తారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వాహనాలు, భూములు, ఆస్తుల విషయంలో అప్రమత్తత అవసరం. గతంలో పెట్టిన పెట్టుబడుల మూలంగా ఆదాయం రావచ్చు.
మార్గశిరం: తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. నిర్మాణ కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి అనుకూల సమయం. మంచి సంస్థల్లో ఉద్యోగం లభిస్తుంది.
పుష్యం: అనుకున్న పనులు సంతృప్తిగా పూర్తవుతాయి. ఉద్యోగులకు పరపతి పెరుగుతుంది. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆత్మీయుల రాకతో ఇంటిలో పండుగ వాతావరణం నెలకొంటుంది.
మాఘం: ఊహించని ఖర్చులు ముందుకు రావచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. విద్యార్థులు శ్రద్ధ కనబరిస్తే మంచి ఫలితాలను పొందుతారు. పై చదువులకు అనుకూలం. ఉత్సాహంతో ఉంటారు.
ఫాల్గుణం: ప్రారంభించిన పనులలో ఆటంకాలు, శ్రమాధికం అయినప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. మనశ్శాంతి కోసం తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. శుభకార్యాలు చేస్తారు.
ఈ రాశివారికి గురువు చతుర్థంలో (ఏప్రిల్ 31 వరకు), సంవత్సరం పూర్తయ్యే దాకా ఐదింట ఉంటాడు. ద్వితీయంలో శని, తృతీయంలో రాహువు, భాగ్యంలో కేతువు సంచరిస్తారు. శని మినహా మిగిలిన గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఏల్నాటి శని ప్రభావం కూడా తీరిపోతున్నది. ఏదైనా మేలు తప్పకుండా కలుగుతుంది. శివారాధన శుభప్రదం.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

