విత్తనాల ఉత్పత్తిలో తెలంగాణ గణనీయ పురోగతి సాధించింది. సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ ఖ్యాతి గడించింది. దేశంలో పంటల విత్తనాల్లో 40% వరకు మన రాష్ర్టానివే ఉన్నాయి.
తెలంగాణలో ఎనిమిదేండ్లలోనే స్వల్ప కాలంలో చేపట్టిన వ్యవసాయరంగ అభివృద్ధి, అనుసరిస్తున్న వినూత్న విధానాలు.. దేశ రైతాంగ సంక్షేమంలో స్వర్ణయుగానికి బాటలు వేశాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం మరోసారి అంతర్జాతీయ ఖ్యాతిని చాటుకున్నది. ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ రాష్ర్టాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఈ నెల 4, 5వ తేదీల్లో సమితి అనుబంధ సంస్థ అయి�