జాతీయ సైన్స్ దినోత్సవాన్ని బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సైన్స్ కేంద్రంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ యాదయ్య అధ్యక్షతన, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
సర్ సీవీ రామన్ జయంతిని పురస్కరించుకుని జిల్లాలోని విద్యాసంస్థల్లో బుధవారం సైన్స్‌డే ఘనంగా నిర్వహించారు. సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రంగారెడ్డి జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు మంగళవారం నుంచి ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీఠంలో జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను డీఈవో సుశీందర్‌రావు సోమవారం పర్యవేక్షించారు.