‘నేటి దంపతుల్లో సంతానలేమి సమస్య ఎక్కువగా ఉంది. ఒక సర్వేప్రకారం ప్రతి పది జంటల్లో మూడు జంటలు ఇన్ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు. వారందరూ ఈ సినిమాతో రిలేట్ అవుతారు’ అన్నారు హీరో విక్రాంత్.
‘మన సమాజంలో చాలా మంది ఎదుర్కొంటున్న మేల్ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూని వినోదాత్మకంగా చర్చిస్తూ ఈ సినిమాను తెరకెక్కించాం. సమస్యపై అవగాహన కల్పిస్తూ చిన్న సందేశం కూడా ఉంటుంది’ అన్నారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. �
జాక్ రెడ్డి.. ఇతనికి కాస్త కుల ఫీలింగ్ ఎక్కువ. ‘యోగి వేమన కూడా మా కులంవాడే.. ఆయన అసలు పేరు వేమారెడ్డి.’ అని గర్వంగా చెప్పుకుతిరిగేంత కులాభిమానం ఇతని సొంతం.