విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సంతాన ప్రాప్తిరస్తు’. సంజీవ్‌రెడ్డి దర్శకుడు. మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి నిర్మాతలు. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. గురువారం నటి చాందినీ చౌదరి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
ఇందులో ఆమె పాత్ర పేరు కల్యాణి ఓరుగంటి. పెళ్లికూతురుగా ముస్తాబైన కల్యాణి ఓరుగంటిగా చాందినీ చౌదరిని ఈ పోస్టర్లో చూడొచ్చు. వివాహానంతరం కొత్త జంటలు ఎదుర్కొంటున్న ఓ సమస్య నేపథ్యంలో వినోదభరితంగా ఈ సినిమా సాగుతుందని మేకర్స్ చెబుతున్నారు. డాక్టర్ భ్రమరంగా వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్‌గౌడ్, హర్షవర్దన్, సత్యకృష్ణ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: మహిరెడ్డి పండుగుల, సంగీతం: సునీల్ కశ్యప్.