విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘సంతానప్రాప్తిరస్తు’. సంజీవ్ రెడ్డి దర్శకుడు. మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ పతాకాలపై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్విప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. సంతానలేమి సమస్యను చర్చిస్తూ వినోదం, సందేశం కలబోతగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మంగళవారం ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. సునీల్‌కశ్యప్ స్వరపరచిన ఈ పాటను రామ్ మిరియాల ఆలపించారు.
‘సంతానప్రాప్తిరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు..సంతాన ప్రాప్తిరస్తు ఆశీర్వదిస్తూ ఆల్ ది బెస్ట్, నెత్తిన జిలకర బెల్లం పెట్టు, మంగళసూత్రం మెళ్లోన కట్టు, లక్షలు వోసి దావత్ వెట్టు, కొత్తగ వేరే కాపురమెట్టు, నీదేమో నైట్‌షిప్ట్, నీ వైఫ్ది మార్నింగ్ షిఫ్ట్ వీకెండ్లో రొమాన్స్‌కు ప్లానింగ్ చేసి లెక్కలుగట్టు’ అంటూ నేటి యువత వివాహ జీవితాన్ని ఆవిష్కరిస్తూ సాగిందీ పాట. వెన్నెల కిషోర్, తరుణ్‌భాస్కర్, అభినమ్ గోమటం, మురళీధర్ గౌడ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌కశ్యప్, దర్శకత్వం: సంజీవ్ రెడ్డి.