వేసవిలో జంటనగరాలకు తాగునీటి సరఫరాపై ప్రత్యామ్నాయాన్ని కనుగొనేందుకు జలమండలి అధికారులు శనివారం నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి సమీపంలోని ఏఎమ్మార్పీ ప్రాజెక్టును సందర్శించారు.
నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీట మట్టం గణనీయంగా పెరుగుతూ శుక్రవారం క్రస్ట్ గేట్ల లెవల్ 546 అడుగులను దాటి 551.30 (212.6510 టీఎంసీలు) అడుగులకు చేరింది.
వానకాలం వరుణుడు కరుణించకపోవడంతో ఎగున వర్షాల్లేక నాగార్జునసాగర్‌లోకి వరద చేరని సంగతి తెలిసిందే. దాంతో యాసంగి సీజన్‌కు సాగర్, ఏఎమ్మార్పీ ఆయకట్టులో ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది.