కరీంనగర్ నగరపాలక సంస్థ వాటర్ ప్లస్ హోదా దకించుకోవడం గర్వకారణమని మేయర్ యాదగిరి సునీల్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో సంబురాలు జరుపుకున్నారు.
వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించేందుకు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చే రైతుల ఆకలి తీర్చేందుకు పాలకవర్గం వరుసగా రెండో సీజన్లోనూ ‘ఉచిత మధ్యాహ్న భోజనం’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది.
నాడు ఊరూరా పంచాయతీ భవనాలు అరకొర వసతులతో, అధ్వానంగా ఉండేవి. ఎప్పుడో నిర్మించినవి కావడంతో గోడలు పగుళ్లు చూపి, పై కప్పు పెచ్చులూడుతూ పాలకవర్గ సభ్యులు, సిబ్బందిని నిత్యం నరకం చూపించేవి. అసలు కొన్ని గ్రామాలకు